శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 22:21:46

మహారాష్ట్రలో కరోనా కల్లోలం

మహారాష్ట్రలో కరోనా కల్లోలం

ముంబై : మహారాష్ట్రలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. నిత్యం వేలల్లో పాజిటివ్‌ కేసలు నమోదవుతుండగా అంతకంతకు మరణాల సంఖ్య పెరుగుతోంది. గురువారం ఆ రాష్ట్రవ్యాప్తంగా 11,147 కరోనా కేసులు నమోదు కాగా 8,860 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి కాగా 266 మంది మృత్యువాతపడ్డారు.  ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 4,11,798 మంది కరోనా బారిపడగా 2,48,615 మంది చికిత్సకు కోలుకున్నారు. 1,48,150 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 14,463 మంది తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా మృతి చెందారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15,83,792 కరోనా కేసులు నమోదు కాగా 10,20,582 మంది కోలుకున్నారు. 5,28,242 మంది చికిత్స పొందుతుండగా 35 వేల మంది మరణించారు.


logo