మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 23:55:46

నెలాఖరు వరకు బెంగాల్‌లో లాక్‌డౌన్‌

నెలాఖరు వరకు బెంగాల్‌లో లాక్‌డౌన్‌

కలకత్తా : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కంటైనింగ్ జోన్ ఆధారిత కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ ఈ నెల 31 వరకు కొనసాగుతుందని ఆదివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ హోంశాఖ తెలిపింది.  ఈ మేరకు విడుదల చేసిన నోట్‌లో డీఎంలు, డీజీపీ, సీపీ కొల్‌కతాకు సలహా ఇచ్చింది. ‘స్థానిక పరిస్థితిని బట్టి పట్టణం,  జోన్ల వారీగా డీఎంలు లాక్‌డౌన్‌ కొనసాగించవచ్చు. ఐదు నుంచి ఏడు రోజుల పాటు నిర్ణయం తీసుకోవచ్చు’ అని చెప్పింది. ‘రాష్ట్రవ్యాప్తంగా కంటైనింగ్ జోన్ ఆధారిత లాక్ డౌన్ జూలై 31 వరకు కొనసాగుతుంది’ అని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో శనివారం కొత్తగా 2,278 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 42,487కు చేరింది. శనివారం ఒకే రోజు 36 మంది వైరస్‌తో చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 1,112కి చేరిందని ఆరోగ్యశాఖ చెప్పింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo