ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 21:33:16

కొహిమాలో వారంపాటు లాక్‌డౌన్‌ పొడిగింపు

కొహిమాలో వారంపాటు లాక్‌డౌన్‌ పొడిగింపు

కొహిమా : నాగాలాండ్‌ రాజధాని కొహిమాలో కరోనా నియంత్రణకు మరోవారం పాటు (ఆగష్టు 7వరకు) లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  గతంలో జులై 23న జారీ చేసిన ఉత్తర్వులకు కొనసాగింపుగా కోహిమా డిప్యూటీ కమిషనర్ గ్రెగరీ తేజావేలీ మున్సిపాలిటీ పరిధిలో ఏడురోజులపాటు లాక్‌డౌన్‌  పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం పేర్కొంది. కోహిమాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 25 నుంచి వారంపాటు లాక్‌డౌన్‌ విధించారు. నేటితో లాక్‌డౌన్‌ ముగియనుండగా మరోవారం పాటు పొడిగించారు. ఇప్పటివరకు నాగాలాండ్‌ రాష్ట్రవ్యాప్తంగా 936 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది. 


logo