శుక్రవారం 10 జూలై 2020
National - Jun 16, 2020 , 01:58:40

పెద్దలపై లాక్‌డౌన్‌ దెబ్బ

పెద్దలపై లాక్‌డౌన్‌ దెబ్బ

  • 65% మంది జీవనాధారంపై తీవ్ర ప్రభావం తాజా అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 15: లాక్‌డౌన్‌ అనేకమంది జీవితాలను తలకిందులు చేసింది. వృద్ధులను మరింత తీవ్రంగా ప్రభావితం చేసింది. లాక్‌డౌన్‌ వల్ల దాదాపు 65 శాతం మంది వయోధికుల జీవనాధారంపై ప్రభావం పడిందని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘ది ఎల్డర్‌ స్టోరీ: గ్రౌండ్‌ రియాలిటీ డ్యూరింగ్‌ కొవిడ్‌-19’ పేరిట రూపొందించిన ఈ నివేదికను ‘వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన ప్రపంచదినం’ సందర్భంగా సోమవారం విడుదల చేశారు. ‘హెల్ప్‌ ఏజ్‌ ఇండియా’ అనే సంస్థ ఈ అధ్యయనం చేసింది.  

  • 65%- లాక్‌డౌన్‌ వల్ల జీవనోపాధి కోల్పోయిన  వయోధికులు. వీరిలో 67 శాతం మంది 60-69 ఏండ్ల వయసువారు. 
  • 71% - తమ కుటుంబాన్ని పోషించేవారి జీవనాధారం దెబ్బతిన్నదని చెప్పిన వయోధికులు.
  • 42%- తమ ఆరోగ్య పరిస్థితి దెబ్బతిన్నదని చెప్పినవారు. వీరిలో 64 శాతం మంది గ్రామీణ, 36 శాతం మంది పట్టణ ప్రాంతాలకు చెందినవారు.
  • 78%- నిత్యావసర సరుకులు, సేవలు పొందేందుకు ఇబ్బందులు పడిననవారు. 
  • 61%- లాక్‌డౌన్‌ వల్ల సామాజిక ఒంటరితనానికి గురైనట్లు పేర్కొన్నవారు.


logo