ఆదివారం 05 జూలై 2020
National - Jun 30, 2020 , 18:43:19

హిరెకెరూర్‌ తాలూకాను సీల్‌ చేయండి: కర్ణాటక మంత్రి

హిరెకెరూర్‌ తాలూకాను సీల్‌ చేయండి: కర్ణాటక మంత్రి

బెంగళూరు: కర్ణాటకలోని హవేరీ జిల్లా హిరెకెరూర్‌ తాలూకాను మొత్తం సీల్‌ చేయాలని ఆ రాష్ట్ర సీఎం బీఎస్‌ యడ్యూరప్పను వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్‌ కోరారు. తాలుకాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కరోనా తాలూకాను తాకిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ఆయన కోరారు. 

‘ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంది. ప్రజలంతా వీలైనంతవరకు అప్రమత్తంగా ఉండాలి. తగిన రక్షణ ప్రమాణాలు పాటించాలి’ అని పాటిల్‌ పేర్కొన్నారు. కాగా, కర్ణాటకలో ఇప్పటి వరకు 14,295 కేసులు నమోదయ్యాయి. 226 మంది మరణించారు. ప్రస్తుతం 6,382 యాక్టివ్‌ కేసులున్నాయి.logo