ఆదివారం 28 ఫిబ్రవరి 2021
National - Jan 20, 2021 , 07:26:41

భూటాన్‌కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్‌’ గిఫ్ట్‌

భూటాన్‌కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్‌’ గిఫ్ట్‌

ముంబై : పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ ఇండియా తయారు చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ‘కొవిషీల్డ్‌’ 1.5లక్షల డోసులను ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం తెల్లవారు జామున భూటాన్‌కు తరలించారు. వ్యాక్సిన్‌ను ఆ దేశానికి భారత్‌ ఉచితంగా అందజేసింది. భారత్‌-భూటాన్‌ ప్రత్యేకమైన సంబంధాలకు అనుగుణంగా.. కొవిడ్‌ ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్‌కు వాణిజ్యం, అవసరమైన వస్తువులను నియంతరం సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు పారాసిటమాల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు, ఎక్స్‌రే యంత్రాలతో పాటు రూ.2.8 కోట్ల విలువైన టెస్టింగ్‌ కిట్లు సహా అవసరమైన మందులు, వైద్య సామగ్రి అందించింది. ట్రాన్‌పోర్ట్ బబుల్‌ కింద ఒప్పందం చేసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న ఆ దేశ పౌరులను స్వదేశానికి పంపేందుకు భారత్‌ సదుపాయాలు కల్పించడంతో పాటు వందే భారత్‌ మిషన్‌ కింద 14 మందిని భూటాన్‌ పౌరులను ఆదేశానికి పంపింది. భూటాన్ ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు భారత్ అనేక చర్యలు తీసుకుంటోంది.

తోర్షా టీ గార్డెన్ (ఇండియా), అహ్లే (భూటాన్) ద్వారా కొత్త వాణిజ్య మార్గాన్ని తెరవడం సహా నాగార్కట, అగర్తాలా, పాండు, జోగిగోపా నది ఓడరేవుల్లో కొత్త వాణిజ్య కేంద్రాలు త్వరలో పని చేయనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ప్రపంచ సమాజం ఆరోగ్య అవసరాలను తీర్చడంలో భారతదేశం దీర్ఘకాల విశ్వసనీయ భాగస్వామిగా గౌరవించబడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ట్వీట్‌ చేశారు. అనేక దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరా బుధవారం ప్రారంభమవుతుందని, రాబోయే రోజు మరిన్ని దేశాలు అనుసరిస్తాయని పేర్కొన్నారు. పొరుగు, ముఖ్య భాగస్వామి దేశాల నుంచి భారతీయ వ్యాక్సిన్‌ల సరఫరా కోసం ప్రభుత్వానికి పలు అభ్యర్థనలు వచ్చాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) మంగళవారం ఓప్రకటనలో తెలిపింది. దేశంలో తయారవుతున్న రెండు కోవిడ్ -19 వ్యాక్సిన్లకు కొవిషీల్డ్, కొవాగ్జిన్లకు భారతదేశం అత్యవసర వినియోగ అధికారాన్ని ఇచ్చింది. అయితే దేశీయ అవసరాలకు తగినన్ని నిల్వలు ఉండేలా చూసుకోవడంతో పాటు విదేశాలకు సరఫరా చేయనున్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది.

VIDEOS

logo