మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 13:09:25

ఐసోలేషన్‌లో తమిళనాడు గవర్నర్

ఐసోలేషన్‌లో  తమిళనాడు  గవర్నర్

చెన్నై:  కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తమిళనాడు గవర్నర్‌  బన్వారీలాల్‌ పురోహిత్‌  సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. వైద్యుల సలహా మేరకు ఒక వారం పాటు గృహ నిర్బంధంలో ఉంటారు. రాజ్‌భవన్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో  గవర్నర్ కార్యాలయం అప్రమత్తమైంది.    ప్రస్తుతం గవర్నర్‌ ఫిట్‌గా ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రాజ్‌భవన్‌ సిబ్బందికి కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు.  


logo