గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 18:55:44

కొవిడ్ -19 చికిత్సకు ఇటోలిజుమాబ్‌ వద్దటా..!

కొవిడ్ -19 చికిత్సకు ఇటోలిజుమాబ్‌ వద్దటా..!

న్యూ ఢిల్లీ: కరోనా వైరస్‌ బారినపడ్డ రోగులకు జాతీయ చికిత్సా ప్రొటోకాల్‌లో ‘ఇటోలిజుమాబ్‌’ అనే సూదిమందును చేర్చకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనిని మితస్థాయి నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలున్న రోగులకు అత్యవసరమైతే ఉపయోగించవ్చని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఇదివరకే అనుమతి ఇచ్చింది.

కొవిడ్ -19పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో ఇటోలిజుమాబ్‌ను ప్రొటోకాల్‌లో చేర్చాలా? వద్దా? అనే దానిపై చర్చించారు. అయితే, ఈ డ్రగ్‌పై నిపుణులు విశ్వాసం చూపకపోవడంతో జాతీయ చికిత్స ప్రొటోకాల్‌నుంచి తప్పించినట్లు ఒక అధికారి వెల్లడించారు. లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo