శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 19:03:56

దవాఖానలో వసతులు లేక.. కరోనా రోగి ఆత్మహత్య

దవాఖానలో వసతులు లేక.. కరోనా రోగి ఆత్మహత్య

సిమ్లా: ప్రభుత్వ దవాఖానలో వసతులు లేకపోవడంపై ఆందోళన చెందిన కరోనా సోకిన మహిళా రోగి ఆత్మహత్య చేసుకున్నది. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆ దవాఖాన వద్ద నిరసన తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఈ ఘటన జరిగింది. స్థానిక దీన్ దయాల్ ఉపాధ్యాయ జోనల్ ప్రభుత్వ ఆసుపత్రిలో తగిన వసతులు, వైద్య సౌకర్యాలు లేకపోవడంపై కరోనా సోకిన ఓ మహిళ ఆందోళన చెందింది. గురువారం ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆ దవాఖాన వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వైద్య సౌకర్యాలు లేక మహిళ ఆత్యహత్య చేసుకోవడంపై నిరసన తెలిపారు. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులు నిరసనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు దవాఖాన అధికారులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి