న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగలమని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) విశ్వాసంతో ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్‌లతోపాటు గోవా అసెంబ్లీలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరుగాల్సి ఉంది. సకాలంలోనే ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర చెప్పారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు 2022 మే నెలాఖరుతో ముగుస్తుంది. మిగతా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ గడువు మార్చి నెలతో తీరిపోతుంది.
కరోనాఉధ్రుతి నేపథ్యంలో బీహార్, పశ్చిమ బెంగాల్‌లతోపాటు ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో చాలా అనుభవం గడించామని సుశీల్ చంద్ర పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
గడువు తీరిపోయే లోపు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించి, గెలుపొందిన శాసనసభ్యులు జాబితాను సంబంధిత రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించడం తమ విధి అని చెప్పారు.
తాజాగా శాసనమండలి/ రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలతోపాటు కొన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలను కరోనా నేపథ్యంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
కరోనా రెండో వేవ్ తీవ్రత గురించి తాము అవగాహనతోనే ఉన్నాం అని సుశీల్ చంద్ర వెల్లడించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతున్నదని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కరోనా మధ్యే నిర్వహించాం అని గుర్తు చేశారు.
ఇటీవలే మరో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించామని చెప్పారు. ఈ ఎన్నికల్లో చాలా అనుభవం గడించామని తెలిపారు. పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.
గతేడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలను కోవిడ్-ప్రీ ఎలక్షన్‌గా నిర్వహించడానికి ఈసీ పలు నిర్ణయాలు తీసుకున్నది. 80 ఏండ్లు దాటిన వారికి, కోవిడ్‌తో బాధపడుతున్న వారికి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది.
ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ ఓటు వేసే ఓటర్ల సంఖ్యను 1500 నుంచి 1000 మందికి తగ్గించివేసింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ పరిధిలో సుమారు 80 వేల పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. ఇదే పద్ధతి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగుతుందని సుశీల్ చంద్ర చెప్పారు.
కరోనా రోగుల్లో కొత్త లక్షణాలు .. కోలుకున్నాక హృద్రోగాలు, శ్వాస రుగ్మతలు
N95 Mask ఉతకొచ్చా? ఎన్ని రోజులకు ఒకసారి మాస్క్ మార్చాలి?
ఆనందయ్య మందు పంపిణీకి కాల్ సెంటర్, యాప్..
టీకాల ఎగుమతిపై భారత్ నిషేధం.. 91 దేశాలపై తీవ్ర ప్రభావం
Coronavirus : జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా?
దేశంలో వ్యాక్సిన్‌కు కొరత లేదు: ఐసీఎమ్మార్
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
రూ 50,000 దిశగా పసిడి పరుగు..రూ 73,000కు చేరువైన వెండి
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
భారీ ఊరట : కొవిడ్-19 నియంత్రణలు పూర్తిగా ఎత్తివేత!
సోషల్సె క్యూరిటీ కోడ్ ఎఫెక్ట్: నేటి నుంచి పీఎఫ్‌తో ఆధార్ లింక్
పైపైకి బంగారం.. డిసెంబర్‌కల్లా రూ.57 వేలకు..!!
చిప్ సప్లయి కొరత: ఇప్పట్లో తేలడం కష్టమే: ఇంటెల్
ఈపీఎఫ్‌వో రిలీఫ్.. సభ్యులకు రెండో కోవిడ్ అడ్వాన్స్!