బుధవారం 27 జనవరి 2021
National - Dec 02, 2020 , 19:02:13

అమెరికాలో పెరుగుతున్న క‌రోనా మ‌ర‌ణాలు

అమెరికాలో పెరుగుతున్న క‌రోనా మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మ‌హ‌మ్మారి మ‌రింత విజృంభిస్తున్న‌ది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. క‌రోనా మ‌ర‌ణాలు కూడా భారీ సంఖ్య‌లోనే ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 2500 మందికిపైగా క‌రోనా బాధితులు మృతిచెందిన‌ట్టు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఏప్రిల్ తర్వాత ఇంత భారీ స్థాయిలో కరోనా మరణాలు సంభవించడం ఇదే తొలిసారని పేర్కొన్న‌ది. 

మంగళవారం ఒక్క‌రోజే అమెరికాలో 1.80 లక్షల మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఇదిలావుంటే అమెరికాలో సగటున నిమిషానికి ఒక కరోనా మర‌ణం నమోదువుతున్న‌ద‌ని గ్లోబల్ హెల్త్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ బెత్ బెల్ తెలిపారు. కాగా, క‌రోనా దేశంలో ప్ర‌వేశించిన‌ది మొద‌లు ఇప్పటివరకు అమెరికాలో 1.41 కోట్ల మంది కరోనా బారినపడగా, మరణాల సంఖ్య 2.80 లక్షలకు చేరువైంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo