మంగళవారం 26 మే 2020
National - May 23, 2020 , 01:40:35

వచ్చేనెలలో మరింత విజృంభణ

వచ్చేనెలలో మరింత విజృంభణ

న్యూఢిల్లీ: వచ్చేనెలలో కరోనా మరింత విజృంభించే ప్రమాదముందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వచ్చేనెల 21 నుంచి 28 మధ్య కేసులు విపరీతంగా పెరుగుతాయని, ప్రతి రోజు 7 వేల నుంచి 7,500 వరకు కేసులు నమోదయ్యే అవకాశముందని పరిశోధకులు చెప్పారు. కరోనా ఉన్నప్పటికీ ఆ లక్షణాలు బయటపడనివాళ్లు ఎక్కువగా బయట తిరుగుతున్నారని, కేసుల పెరుగుదలకు ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారు. బెంగాల్‌కు చెందిన జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ బైరాగి, మరి కొందరు కలిసి ఈ అధ్యయనం చేపట్టారు. చైనాలోని వుహాన్‌లో 75 రోజుల లాక్‌డౌన్‌ తర్వాత వైరస్‌ అదుపులోకి వచ్చిందని, కానీ భారత్‌లో లాక్‌డౌన్‌ విధించి దాదాపు రెండు నెలలు అవుతున్నా ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదని, పైగా కేసులు పెరుగుతున్నాయని పరిశోధకులు చెప్పారు. అక్టోబర్‌ మొదటి వారం నాటికి దేశంలో కేసుల సంఖ్య 5 లక్షల వరకు చేరవచ్చని పేర్కొన్నారు. 


logo