ఆదివారం 05 జూలై 2020
National - Jun 17, 2020 , 18:47:30

తమిళనాడులో 50వేలు దాటిన కరోనా కేసులు

తమిళనాడులో 50వేలు దాటిన కరోనా కేసులు

చెన్నై : తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. బుధవారం ఒక్క రోజే 2147 కేసులు నమోదయ్యాయి. ఇందులో చెన్నైలోనే 1276 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మరో 48 మంది మృతి చెందారు. మొత్తం 567 మంది కరోనా సోకి చనిపోయారు. ఇప్పటి వరకు 27,624 కరోనా నుంచి కొలుకొని ఇండ్లకు వెళ్లినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. మరో 21, 990 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 50,193 కోవిడ్‌-19కేసులు నమోదవగా, రాజధాని చైన్నైలోనే 35,556 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.


logo