శుక్రవారం 10 జూలై 2020
National - Jun 02, 2020 , 09:24:54

కొత్తగా 8171 మందికి కరోనా పాజిటివ్‌

కొత్తగా 8171 మందికి కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజూకూ పెరిగిపోతూనే ఉంది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుల తర్వాత వైరస్‌ విజృంభిస్తోంది.  దేశంలో కరోనా బాధితుల సంఖ్య  2లక్షలకు చేరువలో ఉంది.   తాజాగా 24 గంటల్లో  కొత్తగా 8,171 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 198,706 కు పెరిగింది. గడచిన 24 గంటల్లో మరో 204 మంది చనిపోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,598కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 97,581 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 95,526 డిశ్చార్జ్‌ అయ్యారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఢిల్లీలో మరణాలు గణనీయంగా పెరిగాయి. 


logo