శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 10:28:45

కరోనా ఎఫెక్ట్‌ : హరిద్వార్‌ జిల్లా సరిహద్దు మూసివేత

కరోనా ఎఫెక్ట్‌ : హరిద్వార్‌ జిల్లా సరిహద్దు మూసివేత

హరిద్వార్‌ : ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని హరిద్వార్‌ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందన ఆ జిల్లా సరిహద్దును శనివారం నుంచి ఈ నెల 20 వరకు మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోంవతి అవమాస్య సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి గంగానది ఘాట్‌లో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులను అనుమతించబోమని హరిద్వార్‌ స్పెషల్‌ ఎస్పీ సెంథిల్‌ అవోదయ్‌ కే రాజ్‌ పేర్కొన్నారు.

నిబంధనలను అతిక్రమించిన ఇతర ప్రాంతాల వారికి 14 రోజులపాటు హోంక్వారంటైన్‌ విధిస్తామని చెప్పారు. రెండురోజలుపాటు సరిహద్దును మూసివేస్తున్నందున జిల్లావాసులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలో కన్వార్‌ యాత్ర సందర్భంగా జిల్లాలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇదే తరహా నిబంధనలను అమలు చేసింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,982 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ వెల్లడించింది.

తాజావార్తలు


logo