గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 23:54:37

కోవిడ్-19 సోకిన వ్యక్తులను గుర్తించి, ప్రమాదాన్ని అంచనా వేసే యాప్

కోవిడ్-19 సోకిన వ్యక్తులను గుర్తించి, ప్రమాదాన్ని అంచనా వేసే యాప్

చెన్నై: శాస్త్ర, సాంకేతిక విభాగం (డి.ఎస్.టి) చొరవతో సెంటర్ ఫర్ ఆగ్మెంటింగ్ వార్ విత్ కోవిడ్ -19 హెల్త్ క్రైసిస్ (కావాచ్), లైఫాస్ కోవిడ్ స్కోర్ అనే కోవిడ్ రిస్క్ అసెస్‌మెంట్ ప్రొఫైల్‌ను అభివృద్ధి చేయడానికి బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ అకులి ప్రయోగశాలను ఎంపిక చేసింది.  అక్యులి ప్రయోగశాల "లైఫాస్" అనే క్లినికల్-గ్రేడ్, నాన్-ఇన్వాసివ్, డిజిటల్ ఫంక్షనల్ బయోమార్కర్ స్మార్ట్ ఫోన్ సాధనంతో పరీక్ష చేసి ముందస్తుగా గుర్తించడం, మూల కారణ విశ్లేషణ, రిస్కు అంచనా, రోగ నిరూపణ , దీర్ఘకాలిక వ్యాధుల ఇంటి పర్యవేక్షణ వంటి లైఫాస్ కోవిడ్ స్కోరుకు అవసరమైన ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. 2020 మార్చి నెలలో, కోవిడ్ సమస్యను పరిష్కరించే సాంకేతిక పరిజ్ఞానాలకు భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖ సహకరించింది.  భారీ సంఖ్యలో పరీక్షల నిర్వహణ పరిష్కారం కోసం అనేక దశల పరీక్షల అనంతరం అక్యులీ ప్రయోగశాల ఎంపిక చేశారు. 

దీని ఉత్పత్తి "లైఫాస్" ‌కు డి.ఎస్.‌టి. నుంచి 30 లక్షల రూపాయల గ్రాంట్ లభించింది. ఇప్పుడు  ఐ.ఐ.టి., మద్రాస్, హెల్త్ కేర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ (హెచ్‌.టి.ఐ.సి), మెడ్ ‌టెక్ ఇంక్యుబేటర్ సంస్థలు ఆన్ లైన్ లో మద్దతు ఇస్తున్నాయి. లైఫాస్ అనేది ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్, దీనిలో ఒక మొబైల్ ఫోన్  వెనుక ఫోన్ కెమెరాలో చూపుడు వేలును 5 నిమిషాలు ఉంచినప్పుడు, కేశనాళిక నాడి, రక్త పరిమాణం మార్పును సంగ్రహిస్తుంది . యాజమాన్య అల్గోరిథంలు ,సిగ్నల్ ప్రాసెసింగ్ పద్ధతులతో 95 బయోమార్కర్లను పొందుతుంది.  ఇది శరీర సంకేతాల సమూహాన్ని సంగ్రహించడానికి స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ స్మార్ట్ ఫోన్ సెన్సార్ల శక్తిని ఉపయోగిస్తుంది.  ఆ తరువాత, ఫోటోప్లెథిస్మోగ్రఫీ (పి.పి.జి), ఫోటో క్రోమాటోగ్రఫీ (పి.సి.జి), ఆర్టిరియల్ ఫోటోప్లెథిస్మోగ్రఫీ (ఎ.పి.పి.జి), మొబైల్ స్పైరోమెట్రీ ,పల్స్ రేట్ వేరియబిలిటీ (పి.ఆర్.వి) సూత్రంపై సిగ్నల్స్ ప్రాసెస్ చేస్తారు. జనాభా పరీక్ష, నిర్బంధ వ్యక్తుల పర్యవేక్షణ ,సమాజ వ్యాప్తి దశలో నిఘా వంటి వాటిపై సాంకేతికత దృష్టి సారించింది.  మేదాంత మెడిసిటీ ఆసుపత్రితో నిర్వహించిన అధ్యయనంలో 92 శాతం ఖచ్చితత్వం, 90 శాతం నిర్దిష్టత 92 శాతం సున్నితత్వం కలిగిన వ్యాధి లక్షణాలు లేని వ్యక్తులను గుర్తించడానికి నిరూపించారు.

ఈ సందర్భంగా శాస్త్ర, సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ, "చవకైన, అందుబాటులో ఉండే, పాయింట్-ఆఫ్-కేర్ స్మార్ట్ ఫోన్ ఆధారిత విశ్లేషణ అనేది అధిక ప్రమాదకర కేసులను పరీక్షించడంలో, నిర్బంధ కేసుల నిరంతర పర్యవేక్షణ , సాధారణ నిఘాలో అద్భుతంగా సహాయపడే శక్తివంతమైన సాధనం." అని పేర్కొన్నారు. " వేగం, సమర్థతతో ఉద్భవిస్తున్న సవాళ్లకు సంబంధిత  సృజనాత్మక పరిష్కారాలను ఆవిష్కరించడంలో సాంకేతిక అంకురసంస్థల శక్తి పెరుగుతున్నదని చెప్పడానికి "లైఫాస్" ఒక  ఉదాహరణ ” అని ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు. పరీక్షా ప్రయత్నాలు , నియంత్రణ చర్యలు సెప్టెంబర్ చివరి నాటికి పూర్తవుతాయని, ఆ తర్వాత పరీక్షా సౌకర్యం సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.


logo