శనివారం 16 జనవరి 2021
National - Jan 13, 2021 , 07:59:12

హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తరలింపు

హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తరలింపు

హైదరాబాద్‌ : భారత్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ తరలింపు మొదలైంది. కొవాగ్జిన్‌ను వ్యాక్సిన్‌ను బుధవారం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అధికారులు ఢిల్లీకి తరలించారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యాక్సిన్‌ను తరలించారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ దేశవ్యాప్తంగా కార్యక్రమం కేంద్రం నిర్ణయించింది. మొదటి విడతలో ఆరోగ్య కార్యకర్తలతో పాటు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌తో పాటు వృద్ధులకు ఇవ్వనుంది. ఇందులో భాగంగా డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్’‌, సీరం ఇనిస్టిట్యూట్‌ ‘కొవిషీల్డ్‌’కు కేంద్రం ఆర్డర్‌ ఇచ్చింది. గురువారం నాటికి సీరం ఇనిస్టిట్యూట్‌ 1.1కోట్ల డోసులు, భారత్‌ బయోటెక్‌ 55లక్షల డోసులను అందించనున్నాయి. ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి దేశవ్యాప్తంగా 13 నగరాలకు 54.72లక్షల డోసులను కేంద్రం తరలించింది. ఢిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్‌, హైదరాబాద్‌, విజయవాడ, గౌహతి, లక్నో, చండీగఢ్‌, భువనేశ్వర్‌కు చేరగా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ కేంద్రాలకు వ్యాక్సిన్‌ను తరలిస్తున్నారు. ఇప్పటికే అధికారులు టీకాల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.