శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 20, 2020 , 15:44:45

నిమ్స్‌లో కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌.. ఇద్దరికి వ్యాక్సిన్‌

నిమ్స్‌లో కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌.. ఇద్దరికి వ్యాక్సిన్‌

హైదరాబాద్‌ : నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్‌లో కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను వైద్యులు ప్రారంభించారు. ఇద్దరు వలంటీర్లకు సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో సంభావ్య వ్సాక్సిన్‌ మోతాదు ఇవ్వబడిందని, అయితే వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, బాగా స్పందిస్తున్నారని క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న సీనియర్‌ వైద్యుడు ఒకరు చెప్పారు. ఇండియన్ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌, నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్ తయారు చేసిన ‘కొవాగ్జిన్’ అనే టీకాను అభివృద్ధి చేసింది.

కొవాగ్జిన్‌ టీకాకు సంబంధించి మొదటి, రెండో క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపేందుకు ఇండియన్‌ డ్రగ్‌ రెగ్యులేటరీ అనుమతులను ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 375 మంది వలంటీర్లపై మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించినట్టు సంస్థ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 12 వైద్య కేంద్రాల్లో ‌ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఇందులో నిమ్స్‌ ఒకటి కాగా, దాదాపు 60 మంది అభ్యర్థులపై ట్రయల్స్ నిర్వహించాలని భావిస్తోంది. ట్రయల్స్‌ విజయవంతం అయితే ఈ వ్యాక్సిన్‌ను ఆగష్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo