శుక్రవారం 05 మార్చి 2021
National - Jan 16, 2021 , 15:51:59

టీకా దుష్ప్రభావాలపై పరిహారం పొందాలంటే..

టీకా దుష్ప్రభావాలపై పరిహారం పొందాలంటే..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ శనివారం ప్రారంభమైంది. అయితే టీకా పనితీరు, దుష్ప్రభావాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భార‌త్ బ‌యోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా తీసుకునేవారు సంబంధిత నిబంధనలకు తమ సమ్మతి తెలుపాల్సి ఉంటుందని, సంబంధిత పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. అప్పుడే టీకా వేయించుకోవడం వల్ల ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఆ మేరకు పరిహారం, వైద్య చికిత్స పొందే అవకాశం ఉంటుందని పేర్కొంది. ‘ఏదైనా తీవ్రమైన ప్రతికూల సంఘటనలు జరిగితే, టీకా గ్రహీతలకు ప్రభుత్వం నియమించిన, అధీకృత కేంద్రాలు, ఆసుపత్రులలో వైద్యపరంగా గుర్తింపు పొందిన సంరక్షణ ప్రమాణాలు అందుతాయి. తీవ్రమైన ప్రతికూల సంఘటన జరిగినట్లు నిరూపిస్తే పరిహారాన్ని బీబీఐఎల్‌ చెల్లిస్తుంది. ఐసీఎంఆర్ సెంట్రల్ ఎథిక్స్ కమిటీ పరిహారాన్నినిర్ణయిస్తుంది’ అని భార‌త్ బ‌యోటెక్ సంస్థ వెల్లడించింది. 

మరోవైపు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకా కోవిషీల్డ్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. ఈ టీకా వేయించుకునే వారు ఎలాంటి సమ్మతి పత్రంపై సంతకం చేయాల్సిన అవసరం లేదని ఆ సంస్థ తెలిపింది. కోవాక్సిన్ టీకా గ్రహీతలకు ఫాక్ట్-షీట్, ప్రతికూల ప్రభావ రిపోర్టింగ్ ఫారమ్ ఇవ్వనున్నట్లు చెప్పింది. అయితే కోవిషీల్డ్‌ టీకా వేయించుకున్న ఏడు రోజులలో జ్వరం, నొప్పి, టీకా వేసిన చోట ఎర్రగా కందడం వంటి లక్షణాలుంటాయని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo