హైదరాబాద్: నగరానికి చెందని భారత్ బయోటెక్ ( Bharat Biotech ) కంపెనీకి .. అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. భారత్ బయోటెక్ కంపెనీ కోవాగ్జిన్ ( Covaxin ) కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ కంపెనీకి గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్(జీఎంపీ) సర్టిఫికేట్‌ను హంగేరి ( Hungary ) అధికారులు ఇచ్చారు. హంగేరికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ న్యూట్రిషన్ .. కోవాగ్జిన్‌కు ఈ గుర్తింపును ఇచ్చింది. ఎడురాజీఎండీపీ డేటాబేస్‌లో ఇక ఆ సర్టిఫికేట్ ఉంటుంది. యూరోప్ దేశాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు కోవాగ్జిన్ అందుబాటులోకి వస్తుంది. ఈ గుర్తింపుతో ప్రపంచ స్థాయిలో భారత్‌బయోటెక్ సంస్థ టీకాలు ఉత్పత్తి చేస్తున్నట్లు మరో మైలురాయిని అందుకుందని ఓ ప్రకటనలో ఆ కంపెనీ తెలిపింది. కోవిడ్ పోరాటంలో తమ కంపెనీ ముందుందని, హంగేరి ఇచ్చిన గుర్తింపు వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధిలో నాణ్యతను చాటుతుందని భారత్ బయోటెక్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని దేశాల్లో కోవాగ్జిన్ ఎమర్జెన్సీ వాడకం కోసం కంపెనీ దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.