కొవాగ్జిన్ వలంటీర్‌గా పట్టణాభివృద్ధి మంత్రి

కోల్‌కతా : కోల్‌కతాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటెరిక్ డిసీజ్ (ఎన్ఐసీఈడీ)లో కరోనా టీకా కొవాగ్జిన్ మూడో విడత ట్రయల్స్ బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ట్రయల్స్‌లో పాల్గొనేందుకు బెంగాల్ పట్టణాభివృద్ధి మంత్రి ఫిర్హాద్ హకీమ్ (52) స్వచ్ఛందంగా పాల్గొంటారని, వైద్య పరీక్షల్లో ఫిట్‌గా ఉన్నట్లు తేలిందని ఇనిస్టిట్యూట్ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ పేరుతో టీకాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తొలి, రెండో విడతలో టీకా మెరుగైన ఫలితాలు చూపడంతో మూడో విడతలో దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26వేలపై ప్రయోగాలు నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా ఈ నెల 2వ తేదీ నుంచి ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ట్రయల్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానించామని, టీకాలో భాగస్వామ్యం అయ్యేందుకు మంత్రితో పాటు పలువురు ముందుకు వచ్చారని చెప్పారు. ఈ మేరకు వైద్య పరీక్షలు చేసి వ్యాక్సిన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి స్వచ్ఛందంగా ముందుకు రావడంపై అధికారులు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే కొవాగ్జిన్ ట్రయల్స్‌లో హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌విజ్, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వీసీ తారిఖ్ మన్సూర్ కొవాగ్జిన్ ట్రయల్స్‌లో పాల్గొని, టీకా తీసుకున్నారు.
తాజావార్తలు
- అమెజాన్ ‘బ్లూ ఆరిజన్’ సక్సెస్
- ప్రజావైద్యుడు లక్ష్మణమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- ప్రభాస్ ‘సలార్’ లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్.. విలన్ ఎవరో తెలుసా?
- బెంగళూరు హైవేపై ప్రమాదం : ఒకరు మృతి
- వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
- మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!
- టీకా రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
- ‘శశి’ వచ్చేది ప్రేమికుల రోజుకే..
- టీకా సంరంబం.. కరోనా అంతం !
- పేదలకు ఉచితంగా టీకాలు ఇవ్వాలి: పంజాబ్ సీఎం