బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 16:25:20

హ‌ర్యానాలో కోవ్యాక్సిన్‌ మాన‌వ ట్ర‌య‌ల్స్ ప్రారంభం

హ‌ర్యానాలో కోవ్యాక్సిన్‌ మాన‌వ ట్ర‌య‌ల్స్ ప్రారంభం

హైద‌రాబాద్‌: భార‌త్ బ‌యోటెక్ కంపెనీ త‌యారు చేస్తున్న హ‌ర్యానాలో కోవ్యాక్సిన్‌ మాన‌వ ట్ర‌య‌ల్స్ ప్రారంభం టీకా మాన‌వ‌ ట్ర‌య‌ల్స్ స్టార్ట్ అయ్యాయి.  రోహ‌త‌క్‌లోని పీజీఐ హాస్పిట‌ల్‌లో కోవిడ్ రోగుల‌కు కోవాక్సిన్ టీకాను వేసిన‌ట్లు హ‌ర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ముగ్గురికి వ్యాక్సిన్ ఇచ్చిన‌ట్లు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో ఇవాళ తెలిపారు. అయితే కోవాక్సిన్ టీకా తీసుకున్న వారు క్షేమంగా ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.  వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నమోదు కాలేదన్నారు.  హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ సంస్థ .. క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం కోవాక్సిన్ టీకాను త‌యారు చేసిన విష‌యం తెలిసిందే. ఆ వ్యాక్సిన్ మాన‌వ ట్ర‌య‌ల్స్ ఇప్పుడిప్పుడే మొద‌లైంది.
logo