శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 07, 2020 , 08:56:52

నవంబర్‌లోనే ‘కొవాగ్జిన్‌’ చివరి దశ ట్రయల్స్‌

నవంబర్‌లోనే ‘కొవాగ్జిన్‌’ చివరి దశ ట్రయల్స్‌

హైదరాబాద్‌ : కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న భయంకరమైన వైరస్‌. మహమ్మారి దెబ్బకు ప్రపంచమే చిగురుటాకులా వణుకుతోంది. నిత్యం వేలల్లో జనం వైరస్‌ బారిన పడి మృత్యువాతపడుతున్నారు. అందరూ కొవిడ్‌-19 టీకా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పదికిపైగా వ్యాక్సిన్లు ముందంజలో ఉన్నారు. భారత్‌లోనూ మూడు టీకాలు తయారవుతున్నాయి. ఇందులో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్స్‌ సంస్థ ‘కొవాగ్జిన్‌’ పేరుతో టీకాను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే పలు దశల్లో నిర్వహించిన ట్రయల్స్‌ మెరుగైన ఫలితాలు కనిపించాయి. కోవాగ్జిన్‌ టీకా చివరి దశ హ్యూమన్‌ క్లినికల్‌ నిమ్స్‌లో నవంబర్‌లో ప్రారంభం కానున్నాయి. భారత్‌ బయోటెక్‌, ఐసీఎమ్మార్‌ సంయుక్తాధ్వర్యంలో నిమ్స్‌లో ట్రయల్స్‌ జరుగుతున్నాయి.

వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో వీటిని ప్రారంభించనున్నట్లు నిమ్స్‌ వైద్య వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నిమ్స్‌లో తొలి దశ పరీక్షలు ముగిశాయి. రెండో దశలో భాగంగా మంగళవారం 12 మందికి టీకా ఇచ్చి బూస్టర్‌ డోస్‌ ప్రక్రియ ప్రారంభించామని క్లినికల్‌ ట్రయల్స్‌ నోడల్‌ అధికారి తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో మరో 55 మందికి టీకా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తొలిదశలో 45 మందికి నిమ్స్‌లో టీకా ఇవ్వగా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు ట్రయల్స్‌ నిర్వహిస్తున్న వైద్యుల బృందం పేర్కొంది. మొదటి, రెండో దశల్లో మొత్తం వంద వలంటీర్లు భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. మూడో దశ పరీక్షల్లో 200 మందికి టీకా ఇవ్వనున్నట్లు వివరించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.