కొవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతి దేశానికే గర్వకారణం

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని ఫార్మా మేజర్ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగం కోసం డైరెక్టర్ జనరల్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా) (డీసీజీఐ) లైసెన్సింగ్ అనుమతి మంజూరు చేసింది. ఇలా కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదం తెలపడం పట్ల భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల గర్వ కారణం అని అభిప్రాయ పడ్డారు.
తమ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతివ్వడం హర్షణీయం అని కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ఈ అనుమతి భారత శాస్త్రీయ పరిశోధనా సామర్థ్యానికి తార్కాణమని అభివర్ణించారు.
దేశ పర్యావరణహిత ఆవిష్కరణల పథంలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందని కృష్ణ ఎల్ల వ్యాఖ్యానించారు. వివిధ రకాల వైరల్ ప్రొటీన్లను తట్టుకునేలా కొవాగ్జిన్ రూపొందించినట్లు చెప్పారు. కొవాగ్జిన్ బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలను ఉత్పత్తి చేస్తుందన్నారు.
డీసీజీఐ అనుమతి కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి ఊతమిచ్చేలా ఉందని కృష్ణ ఎల్ల సంతోషం వ్యక్తం చేశారు. కొవిడ్-19 నిర్మూలనకు భారత్ బయోటెక్ రూపొందించిన స్వదేశీ టీకా కొవాగ్జిన్‌కు నిపుణుల కమిటీ శనివారం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే.
అనంతరం కొవాగ్జిన్‌కు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని డీసీజీఐకు నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న డీసీజీఐ.. తాజాగా కొవాగ్జిన్ తయారు చేయడానికి లైసెన్సింగ్ అనుమతి జారీ చేసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- తదుపరి సినిమా కోసం కొత్త గెటప్‌లోకి మారనున్న అనుష్క..!
- రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
- రాష్ర్టంలో తగ్గిన చలి తీవ్రత
- మారిన ఓయూ డిస్టెన్స్ పరీక్షల తేదీలు
- రానా- మిహికా బంధానికి తీపి గుర్తు
- సరికొత్త రికార్డ్.. కోటి దాటిన కరోనా టెస్టులు
- రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించనున్న జగన్
- మహేష్ ఫిట్నెస్ గోల్స్.. వీడియో వైరల్
- ‘కొవిడ్ నెగెటివ్’ నిబంధన ఎత్తేసిన పూరీ జగన్నాథ్ ట్రస్ట్
- శాకుంతలం చిత్రంపై గాసిప్స్.. క్లారిటీ ఇచ్చిన గుణశేఖర్