శనివారం 05 డిసెంబర్ 2020
National - Aug 19, 2020 , 17:53:31

జీఎంసీహెచ్‌లో కొవాగ్జిన్‌ టీకా రెండోదశ క్లినికల్‌ ట్రయల్స్‌: అసోం ఆరోగ్యశాఖ మంత్రి

జీఎంసీహెచ్‌లో కొవాగ్జిన్‌ టీకా రెండోదశ క్లినికల్‌ ట్రయల్స్‌: అసోం ఆరోగ్యశాఖ మంత్రి

గుహవటి: భారతదేశంలో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 నిరోధక టీకా కొవాగ్జిన్‌ రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం గుహవటి మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ (జీఎంసీహెచ్‌) ఎంపికైందని అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వాశర్మ వెల్లడించారు. మొదటి దశ ట్రయల్స్‌లో విజయవంతమైన ఫలితాలను చూపించిన కొవాగ్జిన్‌ రెండో ఫేస్‌కు జీఎంసీహెచ్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.    

 మంగళవారం రాత్రి వరకు రాష్ట్రంలో 18.22 లక్షల కొవిడ్‌ టెస్ట్‌లు చేశామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 79,667గా ఉండగా, ఇప్పటివరకూ 56,734 మంది కోలుకున్నారని వివరించారు. రికవరీ రేటు 71.2 శాతం, మరణాల రేటు 0.25 శాతం ఉందని వెల్లడించారు. కొవిడ్‌తో ఇప్పటివరకూ 197 మంది మరణించారని శర్మ తెలిపారు.