మంగళవారం 07 జూలై 2020
National - May 30, 2020 , 15:12:03

వరవరరావుకు అస్వస్థత.. నివేదిక కోరిన కోర్టు

వరవరరావుకు అస్వస్థత.. నివేదిక కోరిన కోర్టు

హైదరాబాద్‌ : విరసం నేత, మానవ హక్కుల కార్యకర్త వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక కోర్టు నివేదిక కోరింది. భీమా కోరేగావ్‌ కుట్ర కేసులో అరెస్టు అయిన వరవరరావు.. కొంతకాలంగా ముంబైలోని తాలోజీ జైలులో ఉంటున్న విషయం విదితమే. అయితే ఆయన అస్వస్థతకు గురికావడంతో.. ముంబైలోని జేజే దవాఖానాలో జైలు సిబ్బంది చేర్పించారు. ఈ క్రమంలో తన భర్త ఆరోగ్య పరిస్థితిని తెలియజేయాలని వరవరరావు భార్య హేమలత కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జి డీఈ కొఠాలికర్‌.. వరవరరావు మెడికల్‌ రిపోర్టును అందజేయాలని జేజే హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేశారు. 


logo