శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 24, 2020 , 16:58:55

ఆయోధ్య భూమిపూజ‌పై పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ‌

ఆయోధ్య భూమిపూజ‌పై పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ‌

ల‌క్నో: అయోధ్య‌లో రామ మందిరం నిర్మించ‌డానికి ఆగ‌స్టు 5న నిర్వ‌హించ‌బోయే భూమిపూజ‌, శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని అడ్డుకోవాలంటూ దాఖ‌లైన ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని శుక్ర‌వారం అల‌హాబాద్ హైకోర్టు తిర‌స్క‌రించింది. భూమిపూజవ‌ల్ల క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘ‌న జ‌రుగుతుంద‌న‌డానికి పిటిష‌న్‌లో స‌రైన ఆధారాలు లేవ‌ని, పిటిష‌న‌ర్ పేర్కొన్న అంశాల ఆధారంగా తాము ఈ విష‌యంలో జోక్యం చేసుకోలేమ‌ని కోర్టు స్ప‌ష్టంచేసింది. 

ఆయోధ్య‌లో రామ మందిరం నిర్మాణం కోసం ఆగ‌స్టు 5న భూమిపూజ నిర్వ‌హిస్తున్నార‌ని, ఈ కార్యక్ర‌మానికి దాదాపు 300 మందిని ఆహ్వానించార‌ని, దీనివ‌ల్ల క‌రోనా క‌ట్ట‌డికి కేంద్రం విధించిన సామాజిక దూరం నిబంధ‌న ఉల్లంఘ‌న‌కు గుర‌వుతుంద‌ని ముంబైకి చెందిన‌ సాకేత్ గోఖ‌లే అనే సామాజిక‌వేత్త అల‌హాబాద్ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం జోక్యం చేసుకునేందుకు నిరాక‌రించింది. కాగా, ఆయోధ్యలో భూమిపూజ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కూడా హాజ‌రుకానున్నారు.                 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo