బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 22, 2020 , 11:15:45

తిరుపతిలో గరుడ విగ్రహం సాక్షిగా ఒక్కటైన జంట

తిరుపతిలో గరుడ విగ్రహం సాక్షిగా ఒక్కటైన జంట

కరోనా వైరస్‌ ప్రభావంవల్ల ఓ జంట రోడ్డుపైనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన ఆ జంట తిరుమలలోని స్వామివారి సన్నిధిలో కల్యాణం చేసుకోవాలని భావించి శనివారం బంధుమిత్రులతో కలిసి తిరుపతికి వచ్చారు. అయితే తిరుమలలో పెండ్లిళ్లకు అనుమతి లేదంటూ అలిపిరిలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కరోనా వైరస్‌ కారణంగా తిరుమలలో పెండ్లిళ్లకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు తెలిపారు. దీంతో చేసేదిలేక అలిపిరి రోడ్డులోని గరుడ విగ్రహం సాక్షిగా ఆ జంట ఒక్కటయ్యింది. ఈ పెండ్లికి అలిపిరి అర్బన్‌ పోలీసులే పెద్దలుగా వ్యవహరించారు. తిరుపతి డీఎస్పీలు నాగ సుబ్బన్న, మురళీకృష్ణతోపాటు ఇతర సిబ్బంది కొత్త జంటను ఆశీర్వదించారు.       


logo