శుక్రవారం 10 జూలై 2020
National - Jun 25, 2020 , 11:57:11

పెళ్లిరోజున ఔదార్యం చాటుకున్న దంప‌తులు

పెళ్లిరోజున ఔదార్యం చాటుకున్న దంప‌తులు

పెళ్లంటే అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకోవాల‌ని ప్ర‌తిఒక్క‌రూ అనుకుంటారు. కూడ‌బెట్టుకున్న డ‌బ్బుల‌తో న‌లుగురిని పిలిచి ప‌ప్ప‌న్నం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాల‌నుకుంటారు. క‌రోనా కార‌ణంగా ఇవేమీ కుద‌ర‌డం లేదు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా చాలామంది ఆన్‌లైన్‌లోనే పెళ్లిళ్లు చేసుకుంటారు. ఈ నేప‌థ్యంలో పెళ్లి చేసుకుంటున్న మ‌హారాష్ట్ర‌కు చెందిన ఇద్ద‌రు దంప‌తులు వారి ఔదార్యాన్ని చాటుకున్నారు.

వాసాయిలోని నందాఖ‌ల్ గ్రామానికి చెందిన ఎరిక్ లోబో అనే 28 ఏండ్ల వ్య‌క్తి, అత‌ని భార్య మెర్లిన్ వారి పెళ్లి చ‌ర్చ్‌లో జ‌రుపుకొన్నారు. పెళ్లికి అయ్యే ఖ‌ర్చును క‌రోనా రోగుల‌కు ఉప‌యోగ‌ప‌డేలా 50 హాస్పిట‌ల్ ప‌డ‌క‌లు, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను కొవిడ్‌-19 సంరక్ష‌ణ కేంద్రానికి విరాళంగా ఇచ్చారు. సాధార‌ణంగా వీరి పెళ్లి అంటే 2 వేల మంది అతిథుల‌కు వైన్‌, ఆహారంతో భారీగా ఖ‌ర్చుపెడుతారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో మా నిర్ణ‌యం మార్చుకున్నామ‌ని చెప్పుకొచ్చారు నూత‌న దంప‌తులు. logo