శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 12:45:37

తొంద‌ర‌పాటు ప్రాణాల మీద‌కు తెచ్చింది .. ట్ర‌క్‌ను ఓవ‌ర్‌టేక్ చేయ‌బోయి..

తొంద‌ర‌పాటు ప్రాణాల మీద‌కు తెచ్చింది .. ట్ర‌క్‌ను ఓవ‌ర్‌టేక్ చేయ‌బోయి..

ఎక్క‌డికి అయినా వెళ్లాలంటే ఇంటి నుంచి అస‌లు క‌ద‌ల‌రు. తీరా బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత హ‌డావుడి. ట్రాఫిక్ సిగ్న‌ల్ ప‌డినా కూడా ప‌క్క‌న నుంచి వెళ్లిపోతారే కాని నిదానంగా ఆగి వెళ్లరు. ఈ తొంద‌ర‌పాటుతో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. పుదుచ్ఛెరీలోని నెట్ట‌పాక్కంలో ఓ జంట ట్ర‌క్కును రాంగ్ సైడ్ నుంచి ఓవ‌ర్‌టేక్ చేయ‌బోయి టైర్ల కింద ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న అక్క‌డే ఉన్న సీసీకెమెరాలో రికార్డు అయింది. దీనిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అయింది.

ఒక  ట్ర‌క్ సైడ్ ట‌ర్న్ అవుదామ‌నుకున్న‌ది. ప‌క్క‌నే వ‌స్తున్న బైక‌ర్ దాన్ని ఓవ‌ర్‌టేక్ చేద్దామ‌నుకున్నాడు. బైక‌ర్‌ను గ‌మ‌నించ‌ని ట్ర‌క్ డ్రైవ‌ర్ ట‌ర్నింగ్ తిప్పేశాడు. ఇంకేముంది బైక్ మీద వెళ్తున్న ఇద్ద‌రు ట్ర‌క్ టైర్ల కింద ప‌డిపోయాడు. వీరిని వెంట‌నే హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ చికిత్స పొందుతున్నారు.