శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 01, 2020 , 21:49:03

యూపీలో పరువుహత్య.. కుమార్తెను చంపిన తల్లిదండ్రులు

యూపీలో పరువుహత్య.. కుమార్తెను చంపిన తల్లిదండ్రులు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పరువు హత్య జరిగింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కుమార్తెను ఆమె తల్లిదండ్రులు గొడ్డలితో నరికి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ప్రతాప్‌గఢ్‌లోని రైల్వే ట్రాక్‌పై పడేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 25 న నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే యువతి అల్బాపూర్ వద్ద రైల్వే ట్రాక్‌పై చనిపోయిన కనిపించింది. ఆమె గుర్తింపును నిర్ధారించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ, కిషుందస్‌పూర్ గ్రామ నివాసి కమలేష్ కుమార్ యాదవ్ తన కుమార్తె అని పేర్కొన్నారు. అనంతరం హత్యారోపణలు చేస్తూ ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

తదుపరి విచారణలో కమలేష్, అతని భార్య అనితా దేవిలు నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిని శుక్రవారం నాడు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో దంపతులు తమ 20 ఏండ్ల కుమార్తె ఆరు నెలల గర్భవతి అని తెలుసుకున్న తరువాత గొడ్డలితో నరికి చంపినట్లు అంగీకరించారు. తనకు గర్భం చేసిన వ్యక్తి పేరును వెల్లడించడానికి సదరు యువతి ఇష్టపడలేదని తల్లిదండ్రులు తెలిపారు. కుమార్తె అరోగ్య సమస్యతో బాధపడగా.. వైద్యుడి సలహా మేరకు అక్టోబర్ 24 న రాయ్‌బరేలిలోని ఉంచహార్‌లో అల్ట్రాసౌండ్‌ చేయించగా ఆ యువతి గర్భవతిగా తేలింది. గర్భం దాల్చిన కుమార్తెతో ఇంటికి వెళ్తే పరువు పొతున్నదన్న భయంతో గర్భస్రావం చేయించేందుకు ప్రయత్నించగా.. ఆ యువతి ఒప్పుకోలేదు. వారు నేరుగా అలపూర్ వెళ్లి అక్కడికి సమీపంలో రాత్రి రైల్వే ట్రాక్‌కు తీసుకెళ్లి హత్య చేశారు.  మృతదేహాన్ని ట్రాక్స్‌పై విసిరేసి వెళ్లిపోయారని నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అఖిలేష్ ప్రతాప్ సింగ్ తెలిపారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.