‘మహా’కల్లోలం 4200

- ఒక్కరోజే 552 కేసులు
- దేశవ్యాప్తంగా 1,712..
- ఒకేరోజు కేసుల్లో రికార్డు
- 17వేలు దాటిన బాధితులు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. ఆదివారం ఒక్కరోజే 552 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 4,200 దాటింది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది 25శాతం కంటే ఎక్కువే. ఢిల్లీలో కేసుల సంఖ్య రెండువేలు దాటింది.
రికార్డుస్థాయి కేసులు
దేశవ్యాప్తంగా 24 గంటల్లో 1,712 కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు నమోదై న కేసుల్లో ఇది రికార్డు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 17,029కి, మరణాల సంఖ్య 565కు పెరిగిందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఇందులో మహారాష్ట్రలోనే 223 మంది మరణించారు. దేశంలోని మర ణాల్లో మహారాష్ట్ర వాటానే 40 శాతానికిపైగా ఉన్నది. దేశంలో కరోనా మరణాల శాతం 3.5గా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ సంయు క్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నదని, ఇప్పటివరకు 2,621 మం ది వైరస్ నుంచి కోలుకున్నారని అన్నా రు. దేశంలోని 54 జిల్లాల పరిధిలో గత 14 రోజుల్లో ఒక్క కేసు కూడా రికార్డు కాలేదని చెప్పారు. కరోనా నివారణకు వ్యాక్సిన్లు, ఔషధాల టెస్టింగ్ కోసం వైద్య శాస్త్ర సంబంధ రంగాల ప్రతినిధులతో ఉన్నతస్థాయి టాస్క్ఫోర్స్ ఆదివారం ఏర్పాటైందని తెలిపారు.
10 జిల్లాల్లోనే 46.39% కేసులు
దేశంలో నమోదైన కేసుల్లో 46.39% (6,540) కేసులు 10 జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ముంబైలో 2,079, ఇండోర్లో 842, న్యూ ఢిల్లీ 802, అహ్మదాబాద్ 590, పుణె 496, జైపూర్ 489, హైదరాబాద్ 407, దక్షిణ ఢిల్లీ 320, థానె 293, చెన్నై 222 కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
- రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు
- పట్టుకోలేరనుకున్నాడు..
- ఫ్లాట్లన్నీ విక్రయించాక.. అదనపు అంతస్థు ఎలా నిర్మిస్తారు
- రూ.15 వేల కోసం ప్రాణం తీశారు
- వెలుగులు పంచుతున్న గుట్టలు
- ప్రాథమ్యాలు గుర్తెరిగి పనిచేయండి
- ప్రయాణికులకు డబుల్ ఖుషీ
- 28-01-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
- దేశ సంస్కృతిని చాటిచెప్పేలా..
- పీజీ చదివాడు.. అత్యాశకు పోయాడు