e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News ISRO Eye : ఇస్రో మరో మైలురాయి.. ఆకాశంలో మన ‘కన్ను’

ISRO Eye : ఇస్రో మరో మైలురాయి.. ఆకాశంలో మన ‘కన్ను’

న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన కిరీటంలో మరో కలికి తురాయిని అమర్చుకునేందుకు సిద్ధమైంది. ఆకాశంలో ‘కన్ను’గా భావిస్తున్న భూ పరిశీలన ఉపగ్రహాన్ని (ISRO Eye) ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. గాలిని చీల్చుకుంటూ అంతరిక్షంలోకి బయల్దేరేందుకు బుధవారం తెల్లవారుజామున 3.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈఓఎస్-03 అని పేరు పెట్టిన ఈ ఉపగ్రహాన్ని.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండవ ప్రయోగ వేదిక నుంచి గురువారం ఉదయం 5:43 గంటలకు జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్-ఎఫ్ 10 (జీఎస్‌ఎల్‌వీ) నుంచి ప్రయోగించనున్నారు.

ఇస్రో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్ 2,268 కిలోల జీఐఎస్‌ఏటీ-1 ని జియో-కక్ష్యలో ఉంచుతుంది. ఈ ఉపగ్రహానికి ఈఓఎస్‌-03 అనే కోడ్ ఇచ్చారు. ఇస్రో ఈ సంవత్సరం ప్రారంభించిన మొదటి ప్రాథమిక ఉపగ్రహం కూడా ఇదూ. ఇంతకుముందు ఇస్రో 18 చిన్న ఉపగ్రహాలను ఫిబ్రవరి 28 న ప్రయోగించింది. వాటిలో కొన్ని స్వదేశీ ఉపగ్రహాలు, బ్రెజిల్ ప్రైమరీ శాటిలైట్‌ అమెజానియా-1 కూడా ఉన్నాయి.

ఐ ఇన్‌ ది స్కై .. ఈఓఎస్‌-03

- Advertisement -

ఈ ఉపగ్రహాన్ని జియో ఇమేజింగ్ శాటిలైట్-1 (జీఐఎస్‌ఏటీ-1) అని కూడా పిలుస్తారు. అంతరిక్షంలో ఉండే ఈ కన్ను సాయంతో భారతదేశంతో పాటు చైనా, పాకిస్తాన్ సరిహద్దులను కూడా పర్యవేక్షించవచ్చు. ఈ కారణంగానే ఈ ఉపగ్రహాన్ని ‘ఐ ఇన్ ది స్కై’ అని పిలుస్తారు.

భూ పరిశీలన ఉపగ్రహం (ఈఓఎస్‌-03) ప్రతిరోజూ 4-5 దేశాల చిత్రాలను పంపుతుందని ఇటీవల రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ ఉపగ్రహం సహాయంతో నీటి వనరులు, పంటలు, తుఫానులు, వరదలు, అటవీ విస్తీర్ణంలో మార్పులను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించడం సాధ్యమవుతుంది.

ఈ ఉపగ్రహం భూమిపై 36 వేల కిలోమీటర్ల దూరంలో అమర్చిన తర్వాత.. అధునాతన ‘ఐ ఇన్ ది స్కై’.. అంటే ఆకాశంలో ఇస్రో ‘కన్ను’గా పనిచేస్తుంది. ఈ ఉపగ్రహం భూమి భ్రమణంతో సింక్‌ అవుతుంది. ఇది ఒకే చోట స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఈ శాటిలైట్‌ ఒక పెద్ద ప్రాంతం రియల్‌టైమ్‌ ఇన్‌ఫర్మేషన్‌ను అందించగలదు. ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతర రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు తక్కువ కక్ష్యల్లో ఉండి అవి క్రమ విరామాల తర్వాత ఒక ప్రదేశానికి తిరిగి వస్తాయి. ఈఓఎస్‌-03 దేశాన్ని రోజుకు నాలుగైదు సార్లు ఫొటోగ్రఫీ చేస్తుంది. వాతావరణం, వాతావరణ మార్పుల డాటాను వివిధ ఏజెన్సీలకు పంపుతుంది.

ఇస్రో బిజీ బిజీ..

వచ్చే ఐదు నెలల్లో ఇస్రో మరో నాలుగు ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. సెప్టెంబరులో రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని (రిసాట్-1A లేదా ఈఓఎస్‌-04) సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్‌ఏఆర్‌) ని అంతరిక్షంలోకి పంపనున్నది. ఇది పగలు, రాత్రి మేఘాల నుంచి ఫొటోలను కూడా తీయగలదు. అలాగే, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) తొలి ప్రయోగం కూడా ఈ ఏడాది చివరి కల్లా జరిగే అవకాశాలు ఉన్నాయి.

వాయిదాల పర్వం..

జియో శాటిలైట్ ఈ కొత్త సిరీస్ ప్రయోగం గత ఏడాది నుంచి వాయిదా పడుతున్నది. ఈ ఏడాది మార్చి 28 న ప్రయోగించాలని తొలుత నిర్ణయించారు. అయితే, సాంకేతిక లోపం కారణంగా ప్రయోగం వాయిదా పడింది. దీని తర్వాత ఏప్రిల్‌, మే నెలల్లో ప్రయోగించాలని భాభించాగా కొవిడ్-19 కి సంబంధ ఆంక్షల కారణంగా ప్రయోగం జరుగలేదు.

ఇవి కూడా చ‌ద‌వండి..

చిన్నారిని చంపేసిన ఆన్‌లైన్‌ చదువు

చేతిలో భగవద్గీత.. నవ్వుతూ ఉరికంభంపైకి..

నీరజ్‌ చోప్రా ‘పసిడి’ రహస్యమిదే..?!

అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్‌లో వధువు.. వీడియో కాల్‌లో పెండ్లి

రక్తంలో షుగర్‌ నియంత్రణకు కృత్రిమ క్లోమం

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement