శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 11:09:56

కాటన్‌ మాస్కులే సురక్షితం : కేంద్రం

కాటన్‌ మాస్కులే సురక్షితం : కేంద్రం

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో నిరోధించడంలో మాస్కులది కీలక పాత్ర. బయటకి వెళ్లేవారు నిరంతరం మాస్కులు ధరించాలని కేంద్రం ఇప్పటికే పలు మార్లు సూచించింది. ప్రజలు కూడా ఈ సూచనను పాటిస్తు మాస్కులు ధరిస్తున్నారు. ఇక ఎన్-95 మాస్కులు కరోనాను నిరోధించేందుకు మెరుగైనవి అనే భావన ప్రజల్లోకి వెళ్తుంది. అయితే వాల్వ్ రెస్పిరేట్లర్లు(ప్రత్యేక కవాటాలు) ఉన్న ఎన్-95 మాస్కులు కరోనా వ్యాప్తిని అడ్డుకోలేవని తాజాగా కేంద్రం ప్రజలను హెచ్చరించింది. ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలంటూ అన్ని రాష్ట్రాలకు లేఖలు కూడా రాసింది.

ఇటువంటివి కరోనా వ్యాప్తికి కారణమవుతాయని కూడా లేఖలో పేర్కొంది. వీటికి బదులు ఇళ్లలో కాటన్ దుస్తులతో చేసిన మాస్కులే సురక్షితమని స్పష్టం చేసింది. ఇక ఇంట్లొనే మాస్కు ఎలా తయారు చేయాలనే దానిపై కేంద్రం ఇప్పటికే మార్గదర్శాకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన సూచనలను కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo