ఆదివారం 12 జూలై 2020
National - Jun 02, 2020 , 02:24:15

దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..

దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..

  • 24 గంటల్లో 8392 కేసులు
  • దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
  • జనాభా పరంగా చూస్తే మెరుగైన స్థితిలోనే
  • ముంబైలో కరోనా వైరస్‌ విలయం
  • దవాఖానల్లో పేరుకుపోతున్న మృతదేహాలు
  • ఇటలీ, స్పెయిన్‌ తరహా పరిస్థితికి చేరువలో!

ముంబై: కరోనా మహమ్మారి సృష్టించిన విలయానికి మానవత్వమనేది మృగ్యమైపోతున్నది. తన, పర అనే భావాల్ని కూడా చెరిపేస్తున్నది. దవాఖానల్లో మంచాలు, స్మశానంలో జాగా లేక వైరస్‌ సోకి మరణించిన వారి మృతదేహాల్ని రోడ్లపైనే వదిలేసిన సంఘటనల్ని, కలలో కూడా చూడని దృశ్యాల్ని ఇటలీ, అమెరికా, స్పెయిన్‌ వంటి దేశాల్లో చూశాం. ‘అయ్యో’ అంటూ ఆవేదనను వ్యక్తపరిచాం. ఇప్పుడు అలాంటి దృశ్యాలే మనదేశంలో కూడా కనిపిస్తున్నాయి. గుండెల్ని మెలిపెడుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. నగరంలో ఇప్పటివరకూ 41,099 కేసులు నమోదవ్వగా, వైరస్‌ కారణంగా 1,319 మంది మరణించారు. రోగులతో దవాఖానల్లోని ఐసీయూలు, వార్డులు నిండిపోయాయి. మంచాల కొరతతో రోగులు నేలపైనే పడుకునే పరిస్థితి. వైరస్‌ వల్ల మరణించిన వారి మృతదేహాల్ని తీసుకుపోవడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో పెద్దమొత్తంలో మృతదేహాలు పేరుకుపోయాయని కింగ్‌ ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ దవాఖానలో పనిచేసే నర్సు ఒకరు తెలిపారు. వైరస్‌ సోకడం వల్లే తమ కుటుంబీకులు మరణించారని తెలిస్తే ఇరుగు పొరుగువారు తమను దూరం పెడుతారని, అద్దెకున్న ఇండ్లల్లోకి యజమానులు రానివ్వరేమోనని కొందరు మృతదేహాల్ని తీసుకుపోవడానికి ముందుకు రావడం లేదు. మృతదేహాన్ని తీసుకుపోతే వైరస్‌ తమకు కూడా సోకుతుందేమోనన్న భయంతో మరికొందరు దూరంగా ఉంటున్నారు. దీంతో నిన్నటివరకూ ఆత్మీయుల మధ్య తిరిగిన వారు.. అనాథ శవాలుగా మారిన దృశ్యాలు చూపరులకు కంటతడిని పెట్టిస్తున్నాయి. మరోవైపు, వైరస్‌ కేసులు ఎక్కువగా వస్తుండటంతో మిగతా రోగాలతో వస్తున్న వారికి కూడా వైద్యులు చికిత్సనందించే స్థితిలో లేరు. దీంతో బ్రెయిన్‌ డెడ్‌ వంటి సమస్యలతో వచ్చే రోగులు సకాలంలో చికిత్స అందక మరణిస్తున్నారు.

మహారాష్ట్రలో 70వేలు దాటిన కేసులు

ముంబై: కరోనా మహమ్మారి మహారాష్ట్రను వణికిస్తున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 2,362 మందికి వైరస్‌ సోకిందని తేలడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 70,013కు చేరింది. తాజాగా 76 మంది మరణించడంతో మొత్తం మృతులు 2,362కు చేరాయి. రాష్ట్రంలోని వివిధ దవాఖానల నుంచి 779 మంది డిశ్చార్జీ కాగా కోలుకున్న వారి సంఖ్య 30,108కి చేరింది. కేవలం ముంబైలోనే 41,099 మందికి కరోనా సోకగా, 1,319 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో మరో హాట్‌స్పాట్‌ కేంద్రం పుణెలో 7020, ఔరంగాబాద్‌ నగరంలో 1504 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

24 గంటల్లో దేశంలో 8,392 కేసుల నమోదు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఉధృతమవుతున్నది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు గత 24 గంటల్లో 8,392 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్క రోజులో ఇన్ని పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,90,535కి చేరుకున్నది. తాజాగా 230 మంది మృతితో మరణాల సంఖ్య 5,394కు చేరింది. దేశీయంగా ప్రతిరోజూ కేసులు పెరుగుతున్నా, జనాభా నిష్పత్తి ప్రకారం మాత్రం గణాంకాలు ఉపశమనాన్ని న్నాయి. ప్రపంచవ్యాప్త కేసులతో పోలి స్తే మనదేశంలో ప్రతి పది లక్షల మం దికి 141మందికి మాత్రమే వైరస్‌ సో కింది. దీనిప్రకారం భారత్‌ 68వ స్థా నంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మరణాలు సుమారు 6.19 శాతం కాగా మనదేశంలో కేవలం 2.83 శాతమే.  


logo