మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 12:45:46

చైనాతో ఘ‌ర్ష‌ణ‌.. క‌మాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు ప్రారంభం

చైనాతో ఘ‌ర్ష‌ణ‌.. క‌మాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు ప్రారంభం

హైద‌రాబాద్‌: ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లోని చుషుల్‌లో ఇవాళ భార‌త‌, చైనా ఆర్మీ ద‌ళాల‌కు చెందిన కార్ప్స్ క‌మాండ‌ర్ స్థాయిలో చ‌ర్చ‌లు ప్రారంభం అయ్యాయి. వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద నుంచి ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించాల్సిన అంశంపై రెండు దేశాల సైనిక అధికారులు చర్చించ‌నున్నారు. గాల్వ‌న్ లోయ్‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ త‌ర్వాత‌.. రెండుసార్లు కార్ప్స్ క‌మాండ‌ర్ స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఆ చ‌ర్చ‌ల్లో కుదిరిన ఒప్పందం ప్ర‌కార‌మే ఇటీవ‌ల వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద నుంచి చైనా, భార‌త ద‌ళాలు వెన‌క్కి వెళ్లాయి.  పెట్రోలింగ్ పాయింట్ 14, పాయింట్ 15 ప్రాంతాల నుంచి సుమారు రెండు కిలోమీట‌ర్ల దూరం చైనా ద‌ళాలు వెన‌క్కి వెళ్లిన‌ట్లు భార‌త ఆర్మీ కూడా ద్రువీక‌రించింది.  

మ‌రో వివాదాస్ప‌ద ప్రాంత‌మైన పాన్‌సాంగ్ సో స‌ర‌స్సు వ‌ద్ద కూడా రెండు దేశాల‌కు చెందిన ద‌ళాలు ఉప‌సంహ‌రించాయి.  అయితే ఇవాళ జ‌రుగుతున్న భేటీలో మ‌రికొన్ని కీల‌క నిర్ణ‌యాలు సైనిక అధికారులు తీసుకోనున్నారు. గాల్వ‌న్ లోయ‌లో రెండు దేశాల సైనికులు ఘ‌ర్ష‌ణ‌కు దిగిన ఘ‌ట‌న‌లో 20 మంది భార‌తీయ సైనికులు వీర‌మ‌ర‌ణం పొందిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. లేహ్‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టించి.. అక్క‌డ గాయ‌ప‌డ్డ సైనికుల్ని క‌లిశారు.  ఆ త‌ర్వాత చైనాకు చెందిన 59 యాప్‌ల‌ను భార‌త్ నిషేధించింది.  దీంతో చైనా కాస్త దిగివ‌చ్చింది.  

logo