బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 05, 2020 , 01:28:36

ప్లాస్మా సాంకేతికతతో కరోనాకు చెక్‌

ప్లాస్మా సాంకేతికతతో కరోనాకు చెక్‌

ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తున్న కరోనాను నియంత్రించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్మా సాంకేతికత చికిత్సే సరైన మార్గమని అంతర్జాతీయంగా పేరొందిన వైరాలజిస్ట్‌ డబ్లూ ఇయాన్‌ లిప్కిన్‌ పేర్కొన్నారు. ‘కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల రక్తం నుంచి సేకరించిన ప్లాస్మాలో ఆ వైరస్‌ను ఎదుర్కొనే ప్రతిరోధకాలు ఉంటాయి. వీటిని బాధిత కరోనా రోగి శరీరంలోకి ప్రవేశపెట్టి ఫలితాలు పొందవచ్చు’ అని ఇయాన్‌ తెలిపారు. ప్రస్తుతం ప్లాస్మా సాంకేతికతపై చైనాలో పరిశోధనలు జరుగుతున్నాయని, అవి విజయవంతమైతే.. కరోనాను అరికట్టవచ్చు అని ఆయన పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు తమ ప్లాస్మాను ప్లాస్మా బ్యాంకుల్లో దానం ఇవ్వాలని సూచించారు.


logo
>>>>>>