ఆదివారం 06 డిసెంబర్ 2020
National - Nov 02, 2020 , 12:27:10

ఈ నెల 14 నుంచి కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ షురూ..

ఈ నెల 14 నుంచి కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ షురూ..

అలీగఢ్‌: ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ అలీఘఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఈ నెల 14వ తేదీ నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ‘కొవాగ్జిన్‌’ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి. ఇవి జనవరి చివరి వరకు కొనసాగనున్నాయి. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ కోసం వెయ్యి మంది వలంటీర్లను వైద్యకళాశాలలో చేర్చుకోనున్నారు.  

కొవాగ్జిన్‌పై క్లినికల్‌ ట్రయల్స్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. వ్యాక్సిన్‌ భద్రత, సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఏఎంయూలోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ (జేఎన్‌ఎంసీ)లో పెద్ద ఎత్తున క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఏంఎయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తారిక్ మన్సూర్ మాట్లాడుతూ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నుంచి అనుమతి పొందిన తరువాత క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం సన్నాహాలు ప్రారంభించామని చెప్పారు. జేఎన్‌ఎంసీ ఆగస్టు నుంచి కొవిడ్‌-19 రోగులకు ప్లాస్మా చికిత్సను కూడా నిర్వహిస్తోంది.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.