ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 15:02:05

క‌రోనా థ‌ర్డ్ వేవ్ త్వ‌ర‌లోనే ముగిసిపోతుంది: కేజ్రివాల్‌

క‌రోనా థ‌ర్డ్ వేవ్ త్వ‌ర‌లోనే ముగిసిపోతుంది: కేజ్రివాల్‌

న్యూఢిల్లీ: ‌ఢిల్లీలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ త్వ‌ర‌లోనే ముగిసిపోతుంద‌ని, ఎవ‌రూ ఆందోళ చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ చెప్పారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో థ‌ర్డ్ వేవ్ కొన‌సాగుతున్న‌ద‌ని, సెకండ్ వేవ్ లాగే థ‌ర్డ్ వేవ్ కూడా త్వ‌ర‌లోనే ముగిసిపోతుంద‌ని ఆయన చెప్పారు. ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాల‌ని కోరారు. క‌రోనాకు మెడిసిన్ వ‌చ్చే వ‌ర‌కు మాస్కును విధిగా ధ‌రించ‌డం అల‌వ‌ర్చుకోవాల‌ని ఆయ‌న సూచించారు. 

చాలామంది మాస్కును మెడ‌కు వేసుకోవ‌డ‌మో లేదంటే ముక్కును క‌వ‌ర్ చేయ‌కుండా ధ‌రించ‌డ‌మో చేస్తున్నార‌ని, అలా కాకుండా ద‌య‌చేసి క‌రెక్టుగా మాస్కును ధ‌రించాల‌ని కేజ్రివాల్ కోరారు. ముక్కుపై మాస్కు ధ‌రించ‌డంవ‌ల్ల శ్వాస తీసుకోవ‌డం ఎంత క‌ష్ట‌మో త‌న‌కు తెలుసున‌ని, కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అంత‌కుమించి వేరే మార్గం లేద‌ని ఆయ‌న చెప్పారు. అదేవిధంగా ఢిల్లీలో వాయు కాలుష్యంపై కూడా ఆయ‌న స్పందించారు. పొరుగు రాష్ట్రాల్లో రైతులు కొయ్య‌కాలును త‌గుల‌బెట్ట‌డంవ‌ల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింద‌న్నారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.