గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 14:33:44

ఇసుక‌తో మాస్క్.. అద్భుత‌మైన సందేశం!

ఇసుక‌తో మాస్క్.. అద్భుత‌మైన సందేశం!

ఫేస్‌మాస్క్‌ను ఎలా ధరించాలి అనే దానిపై అవగాహన కల్పించడానికి ప్రశంసలు పొందిన ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒక ప్రత్యేక కళాకృతిని రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ నాశ‌నం చేస్తున్న‌ది. వైరస్ నుంచి సురక్షితంగా ఉంచడానికి ఫేస్‌మాస్క్ ధరించడం ఉత్తమమైన మార్గాలలో ఒకటి. మాస్క్‌ను స‌రిగ్గా ధ‌రించాలి. నోటితోపాటు ముక్కును స‌రిగ్గా క‌ప్పాలి. కానీ కొంత‌మంది మాత్రం ఈ విష‌యంలో చాలా కేర్‌లెస్‌గా ఉన్నారు. అలా చేయ‌డం వ‌ల్ల కూడా క‌రోనా వ్యాపిస్తుంది అనే అనే విష‌యాన్ని శాండ్ ఆర్ట్ ద్వారా తెలియ‌జేశాడు.

ఒడిశాలోని పూరి బీచ్‌లో శాండ్ ఆర్ట్‌ పట్నాయక్ తన కళాకృతులతో ఫేస్‌మాస్క్ ధరించడానికి సరైన మార్గాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని ప‌ట్నాయ‌క్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఇందులో ఇద్ద‌రు ప‌రుషులు మాస్కులు ధ‌రించి ఉన్నారు. ఒక‌రు స‌రిగ్గా మాస్క్ ధ‌రిస్తే, మ‌రొక‌రు ముక్కుకి కింద బాగంలో మాస్క్ ధ‌రించారు. దీనివ‌ల్ల అత‌నికి క‌రోనా సోకే ప్ర‌మాదం ఉంద‌ని చిత్రం ద్వారా తెలియ‌జేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

 

 


logo