గురువారం 28 మే 2020
National - May 09, 2020 , 07:15:25

శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి!

శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి!

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతుందా? అన్నది సస్పెన్స్‌గా మారింది. చైనాలోని షాంఘై మున్సిపల్‌ దవాఖానకు చెందిన పరిశోధకులు 38 మంది రోగుల వీర్యాన్ని సేకరించి పరీక్షించగా.. ఆరుగురిలో వైరస్‌ ఉన్నట్టు గుర్తించారు. అయితే వైరస్‌ ఎంతకాలంపాటు వీర్యకణాల్లో ఉంటుంది? శృంగారం ద్వారా మరొకరికి వ్యాపిస్తుందా? వంటి వాటికి వారు సమాధానాలు ఇవ్వలేదు. 

క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న పేషెంట్ల‌కు చెందిన వీర్య‌క‌ణాల్లో వైర‌స్ ఆన‌వాళ్లు ఉన్న‌ట్లు గుర్తించారు. దీని ఆధారంగా క‌రోనా వైర‌స్ .. శృంగారం చేస్తే కూడా సోకుతుంద‌న్న ఓ అభిప్రాయానికి వ‌చ్చారు. 38 మంది మ‌గ‌వారికి ప‌రీక్ష‌లు చేయ‌గా.. దాంట్లో 16 శాతం మంది వీర్య‌క‌ణాల్లో క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్లు గుర్తించారు. చైనా ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని జామా నెట్వ‌ర్క్ ఓపెన్‌ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.  

SARS-CoV-2  వైర‌స్ పేషెంట్ల‌లో ఉన్న‌ట్లు గుర్తించామ‌ని, కోలుకుంటున్న‌వారిలోనూ ఆ వైర‌స్ ఉన్న‌ట్లు బీజింగ్ ఆర్మీ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌కు చెందిన డ‌యాన్ జెంగ్ లీ తెలిపారు.  వీర్య‌క‌ణాల్లో ఉన్న వైర‌స్ రెట్టింపు కాక‌పోయినా.. ఆ వైర‌స్ మ‌నిషిలో స‌జీవంగా ఉంద‌న్న సంకేతంగా నిలుస్తుంద‌న్నారు. వీర్య‌క‌ణాల్లో వైర‌స్ ఉండ‌డం పెద్ద‌గా ఆశ్చ‌ర్యానికి గురికావాల్సిన అవ‌స‌రం లేద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. పురుషుల వీర్య‌క‌ణాల్లో అనేక ర‌క‌లా వైర‌స్‌లు ఉంటాయ‌న్నారు.  ఎబోలా, జికా వైర‌స్‌లు కూడా వీర్య‌క‌ణాల ద్వారానే వ్యాప్తి చెందిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. వ్యాధి నుంచి కోలుకున్న చాలా రోజుల త‌ర్వాత కూడా వీర్య క‌ణాల ద్వారా వైర‌స్ వ్యాప్తి జ‌రిగినట్లు గుర్తించారు. ప్ర‌స్తుతానికి క‌రోనా వైర‌స్ ఏ స్థాయిలో శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతోంద‌న్న విష‌యాన్ని శాస్త్ర‌వేత్త‌లు నిర్దారించ‌లేదు. కానీ వైర‌స్ సంక్ర‌మ‌ణ‌ను అడ్డుకోవ‌డంలో శృంగారం కూడా కీల‌కంగా మార‌నున్న‌ది.  

వైర‌స్ సోకిన పేషెంట్లు.. కొన్నాళ్ల పాటు శృంగారానికి దూరంగా ఉండ‌డం ఉత్త‌మం. లేదంటే కండోమ్‌ల‌ను వాడాల్సి ఉంటుంది. ఈ రెండూ ప్ర‌స్తుతం పాటించాల్సిన‌ ర‌క్ష‌ణాత్మ‌క చ‌ర్య‌లు. పిల్ల‌లు కనాల‌నుకునేవారు ప్ర‌స్తుతం ఆ ప్లాన్స్‌ను విర‌మించుకోవాల‌ని ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప‌లుమార్లు హెచ్చ‌రించింది.


logo