శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 09, 2020 , 22:44:34

జలుబు, దగ్గుతో తిరుమలకు రావొద్దు: టీటీడీ

జలుబు, దగ్గుతో తిరుమలకు రావొద్దు: టీటీడీ

తిరుమల: కరోనా వైరస్‌ నేపథ్యంలో టీటీడీ అధికారులు తిరుమల శ్రీవారి దర్శనంపై ఆంక్షలు విధించారు. కరోనా వైరస్‌ లక్షణాలైన జలుబు, దగ్గుతో బాధపడుతున్న భక్తులు తిరుమలకు రావొద్దని సలహా ఇచ్చారు. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న దృష్ట్యా జలుబు, దగ్గు ఉన్నవారికి దర్శనం కల్పించకుండానే వెనక్కి పంపించాలని టీటీడీ అధికారి సిబ్బందిని ఆదేశించారు. ఇలాంటి లక్షణాలతో ఎవరైనా భక్తులు కనిపిస్తే వారిని వెంటనే స్విమ్స్‌కు తరలించాలని ఆలయ అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తచర్యగా భక్తులు సానిటైజర్‌, మాస్కులు వెంట తెచ్చుకోవాలని సూచించారు.logo