బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 20:54:41

ఈ చిన్నారి ముచ్చ‌టైన అల్ల‌రికి మంత్ర‌ముగ్ధుల‌వ్వాల్సిందే!

ఈ చిన్నారి ముచ్చ‌టైన అల్ల‌రికి  మంత్ర‌ముగ్ధుల‌వ్వాల్సిందే!

పిల‌క వేసుకొని ముద్దు మ‌ద్దుగా న‌ర్సుతో ఆడుకుంటున్న ఈ చిన్నారి హాస్ప‌ట‌ల్‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది. 15 నెల‌ల ఈ చిన్నారికి జ‌లుబో, ద‌గ్గో కార‌ణం కాదు. ఈ చిన్నారికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. త‌ల్లికి నెగ‌టివ్ రావ‌డంతో చండీగ‌ఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ హాస్పిట‌ల్ సిబ్బంది షాక్ అయ్యారు. ఈ ప‌సికందుకు ఎలా పాజిటివ్ వ‌చ్చిందో అర్థం కావ‌ట్లేదు వైద్యుల‌కు. వ్యాధి ఉంద‌ని తెలియ‌క ఈ చిన్నారి ఎంత సంతోషంగా ఉందో వీడియో చూస్తే తెలుస్తుంది. న‌రేంద్ త్యాగి అనే న‌ర్స్ పాప‌కి సామాజిక దూరం పాటిస్తూ అల‌రిస్తున్నాడు. ఫ్లైయింగ్ కిస్ ఇవ్వ‌మ‌ని త‌ల్లి చెప్ప‌డంతో ముద్దు పెడుతున్న‌ది క్యూటీ. చిన్నారి చేష్ట‌ల‌కు నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు.


logo