ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 08:56:36

క్వారంటైన్‌లో క‌రోనా బాధితులు ఎంజాయ్.. వీడియో

క్వారంటైన్‌లో క‌రోనా బాధితులు ఎంజాయ్.. వీడియో

దిస్‌పూర్ : కొవిడ్ క్వారంటైన్ సెంట‌ర్లు అన‌గానే అంద‌రికీ భ‌య‌మేస్తోంది. కానీ అందులో ఉన్న కొంద‌రైతే ఎంజాయ్ చేస్తున్నారు. యువ‌కులు, న‌డి వ‌య‌సున్న వారైతే.. త‌మ‌కు తోచిన‌ట్లుగా అంద‌రిని ఉత్సాహ ప‌రుస్తున్నారు. మాన‌సిక ఒత్తిడిని జయించేందుకు మ్యూజిక్ వింటూ కాలం గ‌డుపుతున్నారు క‌రోనా బాధితులు. 

ఓ క్వారంటైన్ సెంట‌ర్‌లో ఉన్న క‌రోనా బాధితులంతా పాట‌లు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ హుషారుగా క‌నిపించారు. అదేక్క‌డో కాదు.. అసోం రాష్ర్టం డిబ్రుఘ‌ర్ జిల్లాలోని ఓ క్వారంటైన్ సెంట‌ర్‌లో. ఓ న‌డి వ‌య‌సున్న వ్య‌క్తి.. పిల్ల‌న‌గ్రోవితో పాట‌లు పాడుతుంటే.. ఒకాయ‌న స్టెప్పులేసి అంద‌రినీ ఉత్తేజ‌ప‌రిచాడు. అలా అంద‌రూ క‌లిసి డ్యాన్స్ చేసి క‌రోనా నుంచి ఉప‌శ‌మ‌నం పొందారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. 

అసోంలో ఇప్ప‌టి వ‌ర‌కు 28,792 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 70 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 8,019 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఈ వైర‌స్ నుంచి 20,700 మంది కోలుకున్నారు.


logo