శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 13:05:07

భారత్‌లో మూడుకు చేరిన కరోనా మృతులు

భారత్‌లో మూడుకు చేరిన కరోనా మృతులు

ముంబయి : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కరోనా వైరస్‌తో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, తాజాగా ఇవాళ మరొకరు చనిపోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్ర ముంబయిలో 64 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్యులు నిర్ధారించారు. కరోనా లక్షణాలతో ఈ వృద్ధుడు కస్తూర్బా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహారాష్ట్రలో మొత్తం 36 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటక కలబురాగికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు, ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ.. కరోనా వైరస్‌తో గత వారం మృతి చెందిన విషయం విదితమే. 

దేశంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే సీఎం ఉద్ధవ్‌ థాకరే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. సినిమా హాల్స్‌, షాపింగ్‌ మాల్స్‌ను మూసివేశారు. అన్ని ఎన్నికలను కూడా వాయిదా వేశారు.


logo