శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 05, 2020 , 02:01:54

కరోనాపై అతి చేస్తున్నారు

కరోనాపై అతి చేస్తున్నారు
  • ఢిల్లీ దారుణాల నుంచి దృష్టి మళ్లించటానికే
  • మమతా బెనర్జీ ఆరోపణ

బునియాద్‌పూర్‌, మార్చి 4: ఢిల్లీ హింసాకాండ నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకే కరోనాపై పెద్దఎత్తున భయాందోళనలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ‘ఈ రోజు కొందరు కరోనా, కరోనా అంటూ గట్టిగా అరుస్తున్నారు. అవును ఇది ప్రమాదకరమైన వైరస్సే. కానీ భయాందోళనలు సృష్టించొద్దు. ఢిల్లీ హింసను మరుగునపడేసేందుకు కొన్ని టీవీ చానెళ్లు కరోనా వైరస్‌ను అధికం చేసి చూపుతున్నాయి’ అని దక్షిణ దినాజ్‌పూర్‌లో జరిగిన తృణముల్‌ కాంగ్రెస్‌ సమావేశంలో మమత అన్నారు. ‘ఢిల్లీ హింసలో చనిపోయినవారు కరోనా వైరస్‌తోగానీ లేదా ఇతర వ్యాధులతోగానీ చనిపోలేదు. వారు అలా చనిపోతే కనీసం ఫలానా వ్యాధితో మరణించారని తెలిసేది. కానీ, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న ప్రజలు అతి క్రూరంగా కాల్చి చంపబడ్డారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. అయినప్పటికీ కనీసం క్షమాపణలు కూడా చెప్పడంలేదని బీజేపీని, కేంద్రాన్ని ఉద్దేశించి పరోక్షంగా మమతా బెనర్జీ విమర్శించారు. 


logo