బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 16:10:33

వ‌జ్రాల ఫేస్‌మాస్క్‌.. దొంగ‌ల కంట్లో ప‌డితే ఇక అంతే!

వ‌జ్రాల ఫేస్‌మాస్క్‌.. దొంగ‌ల కంట్లో ప‌డితే ఇక అంతే!

మొన్న‌టి మొన్న మ‌హారాష్ట్ర‌కు చెందిన ఒక బ‌డా వ్యాపారి బంగారంతో ఫేస్‌మాస్క్ పెట్టుకొని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ నగల వ్యాపారి ఏకంగా వ‌జ్రాల మాస్కులు త‌యారు చేస్తున్నాడు. వీటి ఒక్కొక్క‌టి ధ‌ర రూ. 1.5 ల‌క్ష‌ల నుంచి 4 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. మాస్కుల‌కు అమ‌ర్చే డైమండ్ల‌ను బ‌ట్టి ధ‌ర ఆధార‌ప‌డి ఉంటుంది. అంద‌రూ ఒకేలా మాస్కులు పెట్టుకుంటే ఎవ‌రు ఉన్నోళ్లు, ఎవ‌రు లేనోళ్ల‌ని ఎలా తెలుస్తుంది. అందుకే ఇలా మాస్కులు త‌యారు చేస్తున్నారు. ఇప్పుడు తెలుస్తుంది ఎవ‌రెంత మాత్ర‌మో. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ నగల వ్యాపారి ఏకంగా వజ్రాలతో ఫేస్ మాస్కులను తయారు చేస్తున్నాడు.

వ‌జ్రాల మాస్కుల త‌యారీకి ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిస్తున్నామ‌ని జ్యువెల‌రీ షాపు య‌జ‌మాని దీప‌క్ చోక్సీ తెలిపారు. శ్వాస పీల్చుకోవ‌డానికి అనుకూలంగా ఉండేవిధంగా వీటిని త‌యారు చేస్తున్నార‌ని పేర్కొన్నాడు. బంగారం మాస్క్ పెట్టుకుంటే త‌ల‌త‌లా మెరుగుస్తుంది. అదే డైమండ్ మాస్క్ పెట్టుకుంటే ద‌గ‌ద‌గా మెరిసిపోతుంది అంటున్నారు నెటిజ‌న్లు. ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెడితే మెడ‌లో ఉన్న బంగారు దండ‌ల‌నే క‌త్తిరించుకొని లాక్కెళ్తున్నారు. ఇప్పుడు ముఖానికి మాస్కే వ‌జ్రాలు అయితే.. దొంగ‌ల‌కు చాలా సులువుగా ఉంటుంది. క్ష‌ణాల్లో మాయం చెయొచ్చు.
logo