ఆదివారం 09 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 13:58:26

అయోధ్య భూమిపూజ‌.. పోలీసుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు

అయోధ్య భూమిపూజ‌.. పోలీసుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు

ల‌క్నో : ఈ నెల 5వ తేదీన అయోధ్య‌లో రామ‌మందిరం నిర్మాణానికి భూమిపూజ చేయ‌నున్న విష‌యం విదిత‌మే. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు ఎల్‌కే అద్వానీతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజరు కానున్నారు. ఈ నేప‌థ్యంలో అయోధ్య‌లో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

ఇప్ప‌టికే అయోధ్య‌లో ఒక పూజారికి, 16 మంది పోలీసుల‌కు క‌రోనా సోక‌డంతో యూపీ ప్ర‌భుత్వ యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. పోలీసుల‌కు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. క‌రోనా నెగిటివ్ వచ్చి 45 సంవ‌త్స‌రాల వ‌య‌సులోపు ఉన్న వారిని విధుల‌కు అనుమ‌తిస్తున్నారు. అయోధ్య భూమిపూజ కార్య‌క్ర‌మం విధుల్లో 3,500ల మంది పోలీసులు మోహ‌రించారు. 

అయోధ్య‌లో భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై యూపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్కే తివారీ, ల‌క్నో జోన్ ఏడీజీ స‌త్య‌నారాయ‌ణ్ స‌బ‌త్ స‌మీక్షిస్తున్నారు. భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ను చూసేందుకు ఇద్ద‌రు డీఐజీ స్థాయి అధికారులు, 8 మంది ఎస్పీలను నియ‌మించారు. logo