గురువారం 16 జూలై 2020
National - Jun 21, 2020 , 15:20:55

స్త్రీలు, పురుషుల్లో.. కరోనా ముప్పు ఎవరికి ఎక్కువ?

స్త్రీలు, పురుషుల్లో.. కరోనా ముప్పు ఎవరికి ఎక్కువ?

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్నది. ఆడ, మగ అన్న తేడా లేకుండా అంతా ఈ వైరస్ బారిన పడుతున్నారు. అయితే స్త్రీలు, పురుషుల్లో ఎవరికి ముప్పు ఎక్కువ అన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు పలు అధ్యయనాలు చేశారు. మహిళల కన్నా పురుషులకే కరోనా ముప్పు ఎక్కువని పలు అధ్యయనాల్లో తేలింది. ప్రపంచవ్యాప్తంగా మగవారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది.
ఐదు నుంచి 70 ఏండ్లపైనున్న వయస్కుల వారిపై జరిపిన అధ్యయనాల్లో మహిళల కంటే సుమారు 66 శాతం మంది పురుషులకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో మగవారికే కరోనా ముప్పు ఎక్కువని నిర్ధారణ అయ్యింది. మరణాల రేటు కూడా పురుషుల్లోనే ఎక్కువ. వైరస్ నుంచి కోలుకుంటున్నవారిలో ఆడవారి శాతమే ఎక్కువ. పురుషుల కంటే మహిళల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ పరిశోధనల్లో ఈ విషయాన్ని  పరిగణలోకి తీసుకోవాలని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి.
logo