ఆదివారం 31 మే 2020
National - May 12, 2020 , 19:02:29

కరోనా కచ్చితంగా మనుషులు తయారుచేసిందే

కరోనా కచ్చితంగా మనుషులు తయారుచేసిందే

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను మనుషులే ల్యాబ్‌లో తయారుచేశారని తాను కచ్చితంగా నమ్ముతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. కొవిడ్‌-19 సహజ వైరస్‌ వల్ల సంభవిస్తుందని నమ్మడంలేదని, అందుకే అమెరికా నుంచి చైనా వరకు ఉన్న శాస్త్రీయ సమాజ ప్రపంచం దానితో పోరాడేందుకు ఒక మార్గాన్ని కనుగొనేందుకు కష్టపడుతుందన్నారు. కరోనా వైరస్‌తో ప్రపంచం అతలాకుతలం  అవడం  ఇదే తొలిసారని, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు కూడా ఇలాంటి వైరస్‌ ఒకటి వస్తుందని  ఏనాడూ ఊహించలేదని చెప్పారు. కరోనా వైరస్‌కు టీకా కనుగొనే వరకు దానితో జీవించడం మినహా వేరే మార్గం లేదని గడ్కరీ తేల్చిచెప్పారు. ఈ వైరస్‌ మహమ్మారి నుంచి ఎప్పుడు విముక్తి పొందుతామనేది ఎవరికీ తెలియదని, అందుకని కరోనాతో ఎలా పోరాడాలో, దానితో ఎలా జీవించాలో నేర్చుకోవడం మంచిదని నితిన్‌ గడ్కరి సలహా ఇస్తున్నారు.


logo